శ్రీశైలంలో భక్తుల సందడి


Sun,July 14, 2019 01:11 AM

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు శనివారం వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలా డాయి. వారాంతపు సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి క్షేత్రానికి చేరుకుం టున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామి అమ్మ వార్లను దర్శించు కున్నట్లు దేవస్ధానం అధికారుల అంచనా. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే నదిలో పుణ్య స్నానాలు చేసుకొని కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాడవీధుల నుంచి దర్శ నానికి క్యూలైన్లలో నిలుచున్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు, బ్రేక్ దర్శనానికి గంట సమయం పడుతుం దని ఆలయ పౌర సంబంధాల అధికారి అనిల్ కుమార్ తెలిపారు.

16న శాకాంబరిగా శ్రీశైల భ్రమరాంభిక
ఆషాఢ పౌర్ణమి సందర్బంగా ఈ నెల 16న శ్రీశైల భ్రమరాంభికా దేవి అమ్మవారికి శాకంబరి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో శ్రీరామ చంద్రమూర్తి తెలిపారు. సుమారు 4 వేల కేజీలకు పైగా వివిధ రకాల కూరగాయలు ఆకు కూరలు పండ్లతో అమ్మవారి గర్బాలయము, దేవాలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజున జరిగే శాకాంభరి ఉత్సవంలో అమ్మవారితోపాటు పరివార దేవతామూర్తులను మరియు ఆలయ ప్రాంగణాన్ని అలంకరించుటకు ఉపయోగించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను దేవస్ధానానికి విరాళంగా సమర్పించవచ్చునని తెలిపారు.

చంద్ర గ్రహణం వేళ ఆలయం మూసివేత
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వార్ల ఆలయాలు చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం కాలపూజ చేసి మూసివేస్తున్నట్లు ఈవో శ్రీరామచంద్రమూర్తి శనివారం ప్రకటించారు. ఈ సందర్బంగా ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పీఠం మల్లయ్య, మార్కండేయ శర్మలు మాట్లాడుతూ గ్రహణ కాలం ముగిసిన తరువాత బుధవారం తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుధ్ది, సంప్రోక్షణలు చేసి స్వామి అమ్మవార్లకు ప్రాత:కాల పూజలు నిర్వహిస్తారని తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...