నేడు తుది ఓటరు జాబితా ప్రకటన


Sun,July 14, 2019 01:11 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఆయా పార్టీల నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన అభ్యంతరాల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మహబూబ్‌నగర్ పురపాలికకు సంబంధించి 8, భూత్పూర్ మున్సిపాల్టీలో 13 మొత్తం 21 అభ్యంతరాలు వచ్చాయి. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు అభ్యంతరాలను శనివారం రాత్రి వరకు పరిశీలించారు. ఇందులో చాల వరకు వార్డులో ఓట్లు వేరే వార్డులకు మారినట్లు ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఆదివారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనున్నారు. దీంతో అభ్యర్థులు తుది ఓటరు జాబిత కోసం ఎదురు చూస్తున్నారు.

వార్డులో అభ్యర్థుల ప్రచారం
మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్పూర్ మున్సిపాల్టీలో ఎన్నికలు త్వరలో జరగనుండడంతో అభ్యర్థులు తమ ప్రచారం చేపడుతున్నారు. మరో పక్క రిజర్వేషను మారితే పక్క వార్డులు నిలిచేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాల్టీలో 1,65,496 మంది ఓటర్లు ఉన్నారు. భూత్పూర్ మున్సిపాల్టీలో 10,017 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాల్టీలో 41 వార్డులో నుంచి 49 వార్డులు, భూత్పూర్ మున్సిపాల్టీలో 7 నుంచి 10 వార్డులు పెరిగాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలాదే హవా
స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో 41 వార్డులుగా ఉండగా, 20 మంది మహిళ కౌన్సిలర్లుగా గెలిచారు. అందులో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మహిళలకే అవకాశం వచ్చింది తెలిసింది. ప్రస్తుతం వార్డులు 49 కావటంతో 24 నుంచి 25 వరకు మహిళల అవకాశం లభించనుంది. ఇటివలే జరిగిన మహిళలే జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా ఎన్నికైన విషయం తెలిసింది. మరో మారు మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు కౌన్సిల్ గళం విప్పనున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...