టీఆర్‌ఎస్ సభ్యత్వం కుటుంబానికి భరోసానిస్తుంది


Fri,July 12, 2019 03:12 AM

పెద్దమందడి : టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వంలో నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి కుటుంబానికి పార్టీ భరోసానిస్తుందని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వాల్యానాయక్ అన్నారు. గురువారం మండలంలోని మంగంపల్లి, జగత్‌పల్లి గ్రామాలలో నిర్వహించిన సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఎంపీపీ మేఘారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాల్యానాయక్ మా ట్లాడుతూ గ్రామాలలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త సభ్యత్వాన్ని తప్పనిసరిగా చే యించుకోవాలని, ప్రభు త్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించి వారితో సభ్యత్వాలను చేయించాలన్నారు. సభ్యత్వం చేయడం ద్వారా సభ్యత్వం చేసుకున్న వారు అనివార్య కారణాల వల్ల ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. క్రియాశీలక సభ్యత్వంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రాయితీ ఉంటుందని, మిగతా వారికి రూ.100, సాధారణ సభ్యత్వానికి రూ.30 చెల్లించి సభ్యత్వాలను నమోదు చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన సభ్యత్వాల నమోదు రసీదులు, బుక్‌లు సమర్పించాలన్నారు. సభ్యత్వ నమోదులో వేగం పెంచాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కుమార్‌యాదవ్, నాగేంద్రంయాదవ్, ఎంపీటీసీ కురుమయ్య పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...