సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి


Fri,July 12, 2019 03:10 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా అందించే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా భవన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. బాదేపల్లి, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్ మండలాల నుంచి అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్యర్థుల పూర్తి వివరాలను సేకరించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, హన్వాడ, గండీడ్, నవాబ్‌పేట మండలాలకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని యాదయ్య తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తామన్నారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...