జనం.. ఘనం


Thu,July 11, 2019 03:40 AM

మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లాలో జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. జనాభా నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నా ఫలితం లేకుండాపోతోంది. బా ల్య వివాహాలు పెరగడం, మగ సంతానం కోసం ఎదురు చూడటం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆశించిన స్థాయిలో జరగకపోవడం జనాభా పెరుగుదలకు కారణలవుతున్నాయి. ఓ వైపు జనాభా పెరుగుతుండగా, మరోవైపు మాతృ మరణాలు కూడా అదే స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 35,13,934 మంది ఉ న్నారు. 2011 నాటికి జనాభా వృద్ధిరేటు 15.34 శాతంగా నమోదై 40,53,028 మందికి చేరింది. 2001లో 17,82,340మంది పురుషులు ఉం డగా, 17,31,594మంది మహిళలు ఉన్నారు. ఆ దశాబ్దంలో 14.20శాతం వృద్ధిరేటు నమోదైంది. 2011 విషయానికి వస్తే మొత్తం జనాభా 40,53,028లో 20,50,386మంది పురుషులు ఉన్నారు. 20,02,642 మంది మహిళలు ఉన్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇదిలావుగా జిల్లాల విభజన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాలో 10,4,200 మంది జనాభా ఉన్నారు. ఇందులో పురుషు లు, 5,52,228 మంది, మహిళలు 4,51972 మంది. ఫలదీకరణ రేటు 1.5 శా తం ఉండగా, జనన రేటు 18శాతం, మరణ రేటు 7 శాతం నమోదువుతుంది. జనాభా పెరుగుదల రేటు 13.2 శాతం ఉంది. జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని ఫథకాలు ప్రవేశపేడుతున్నా వాటిని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇం దులో ప్రజల పాత్ర కూడా కొంత ఉందనే చెప్పాలి. జిల్లాలో మూఢ విశ్వాసాలు కూడా అధికంగానే ఉన్నాయి. దీం తో జనాభా ని యంత్రణ పూర్తి స్థాయిలో సాధ్యం కాని పరిస్థితి నెలకొన్నది. ఇందుకు ప్ర ధానంగా బాల్య వివాహాలను ప్రోత్సహించడం, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు నిధులు విడుదల చేయకపోవడం, వేసక్టమీ ఆపరేషన్లపై అపోహాలు ఉండడం, మగపిల్లాడి కోసం వేచి చూడడాన్ని కారణాలుగా చెప్పవచ్చు

కుటుంబ నియంత్రణకు కష్టాలు
జనాభా నివారణ కోసం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం 5800 ఆపరేషన్లు చేయాలని సంబంధిత అధికారులు లక్ష్యాన్ని నిర్ణయించారు. కానీ, 4372 ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఇంకా 1428 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే, వందల సంఖ్యలో మహిళలు ఆపరేషన్లు చేయించుకోవాడానికి ముందుకు వస్తున్నా కొందరు వైద్యు లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అందుకు అవసరమైన బడ్జెట్ విడుదల కాకపోవడంతో లక్ష్యం నెరవేరడంలేదని తెలుస్తోంది.

అవగాహనతోనే జనాభా నియంత్రణ..
కుటుంబ నియంత్రణపై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకోసం తాత్కాలిక పద్దతులైన వేసక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలి. వేకస్టమీ ఆపరేషన్లు చేయడానికి సర్జన్లు సిద్ధంగా ఉన్నప్పటికీ వారితో సంప్రదించి శిబిరాలను నిర్వహించడం లేదని తెలుస్తోంది. కుటుంబ నియంత్రణ పద్ధతులను దంపతులకు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళల్లో నెలసరి రాగానే కాఫర్టీ గర్భసంచిలో ఉండే పద్ధతిని అమల్లోకి తేవడం లేదు. బాల్యవివాహాల నిర్మూలనపై ఆవగాహన కల్పించాలి. మాతృ మరణాలు సంభవించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతినెలా కుంటుబ నియంత్రణ శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ నియంత్రణ పాటిస్తున్న మహిళలకు ప్రోత్సాహకాలు కూడా సకాలంలో అందిస్తే జనాబా నియంత్రణ కొంతమేర సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...