కొత్త టీచర్లు వస్తున్నారు!


Wed,July 10, 2019 02:15 AM

స్టేషన్ మహబూబ్‌నగర్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసి నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఖాళీగా ఉన్న 1,979 పోస్టులగా గాను 2017 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌టీ నియాకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుడల చేసింది. ఇందుకు సంబంధించి సుమారు 50వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్ ద్యారా దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది చివరిలో వీరికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్యారా నియామక పరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి 2018 జూలై చివరి, ఆగస్టు మొదటి వారంలో 1:3 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ సూచన మేరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. అనంతరం 1:1 ప్రకారం ఎంపికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినా కొంత ఆలస్యమైంది. ఎస్జీటీ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే ఉన్నందున ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాషాపండితుల పోస్టులు భర్తీ చేయనున్నారు.

నేటినుంచి టీఆర్టీ ఎంపిక
జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక అడుగుపడింది. టీఎస్‌పీఎస్‌సీ ద్యారా చేపట్టిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్టీ)లో ఎంపికైన అభ్యర్థుల పక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఎస్జీటీ నియామక పక్రియపై హైకోర్టు స్టే ఉన్నందున ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాషాపండితుల పోస్టు భర్తీ చేయనున్నారు. శాశ్వత ఉపాధ్యాయుడు లేని పాఠశాలల్లో కనీసం ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడిని కేటాయించాలని ఉన్నతాధికారులు జిల్లా కమిటీలకు సూచించారు. పాలమూరు కలెక్టర్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తారు. కమిటీలో జెడ్పీ సీఈఓ, కొత్త జిల్లాల డీఈఓలు, ఐటీడీఏ అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. టీపీపీఎస్‌సీ అందించిన జాబితా మేరకు నియామాకాలు చేపట్టనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 526 టీచర్ల పోస్టు భర్తీ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 377 స్కూల్ అసిస్టెంట్, 113 భాషాపడింతులు, 36 పీఈటీల పోస్టులకు మొత్తం 526 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్ర భుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కావ డంతో పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్య తీరనుం ది. ఇప్పటికే డీఈఓ ఎంఈఓలతో సమావేశం నిర్వహించి ఖాళీ పోస్టు వివరాలు అడిగితెలుసుకున్నారు.
షెడ్యూల్ ఇలా..
టీఆర్‌టీ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ సోమవారః షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియం వారీగా ఈ నెల 10న బుధవారం ప్రదర్శిస్తారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకుని కేటగిరీ మీడియం వారీగా ఖాళీల వివరాలను వెల్లడిస్తారు. 13, 14న అభ్యర్థులకు కేటగిరీ మీడియం వారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పోస్టింగ్ పొందిన కొత్త టీచర్లు 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాలి. 17న జాయిన్‌కాని, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను జిల్లా విద్యాధికారి గుర్తిస్తారు. 19న అపాయింట్ అయిన టీచర్లు జాయినింగ్ రిపోర్టును ఎంఈఓలు, హెచ్‌ఎంలకు అందజేయాలి.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...