పొలం ఆరోగ్యంగా ఉంటేనే పంటలు పండుతాయి


Thu,June 20, 2019 02:16 AM

రాజాపూర్: రైతులు తమ అరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారో తమ పొలాన్ని అరోగ్యవంతంగా ఉంచితేనే మంచి పంటలు పండుతయాని జిల్లా వ్యవసాయ అధికారిణి సుచరిత అన్నారు.బుధవారం బాలానగర్ మండల పరిధిలోని శేరిగూడ గ్రామంలో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (NMSA) 2019 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా సోయోల్ హైల్త్ కార్డులను (మృతిక అరోగ్య పత్రాలను) 60 మంది రైతులకు అందాజేశారు.ఈసందర్భంగా అమె మాట్లాడుతూ రైతులు సోయోల్ హైల్త్ కార్డ్‌లో చూపిన విధంగా ఎరువులు వాడి సాగుఖర్చులు తగించుకోవాచ్చని అన్నారు.అలాగే నెల అరోగ్యాన్ని ,పర్యావరణాన్ని కాపాడుకోవాచ్చని రైతులకు సూచించారు.అనంతరం గ్రామానికి చెందిన 9 మంది రైతులకు 90శాతం సబ్సిడీపై జోన్న విత్తనాలను అందాజేశారు.ఈకార్యక్రమంలో జడ్చర్ల డివిజన్ వ్యవసాయ అధికారులు శ్రీనివాస రాజు, ఆంజనేయులు, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్ కోఅర్డినేటర్ రఘురాములు, మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్‌రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ లక్ష్మయ్య, కోదండరాంరెడ్డి, ఏఈవోలు ,గ్రామ రైతు సంఘం నాయకులు ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...