కార్పొరేషన్ ద్వారా గొర్రెలను మంజూరు చేస్తాం


Thu,June 20, 2019 02:15 AM

భూత్పూర్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు సబ్సిడీపై రుణాలను, గొర్రెలను మంజూరు చేస్తామని జిల్లా ఎస్సీ కార్పొరేసన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ యాదయ్య తెలిపారు. మున్సిపాలిటీలో అమిస్తాపూర్‌లో ఎస్సీలకు సంబంధించి 20కోళ్లషెడ్లు వృథాగా ఉన్నందున గొర్రెలను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ కులాన్నికి సంబంధించి ఐదుగురు ఓ యూనిట్‌గా ఏర్పడితే రూ.10లక్షలను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకు 10 యూనిట్లుగా ఏర్పడి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ యూనిట్లలో ఉన్నవారు ఎవ్వరుకూడ గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం తరఫున రుణం పొంది ఉండకూడదు. ప్రభుత్వం ఎలాంటి లబ్ధ్దిపొందకుండా ఉండవలేనని తెలిపారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులై ఉండరాదని సూచించారు. యువతలో పనినైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులను పరిశీలించిన మీదట బ్యాంక్‌ల ద్వారా రుణాలను మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ నాగరాజు, మండల పశువైద్యాధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...