చోరీ కేసును ఛేదించిన జడ్చర్ల పోలీసులు


Thu,June 20, 2019 02:15 AM

జడ్చర్ల రూరల్ : ఎవరూ లేని ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటనను పోలీసులు 20 రోజుల్లోనే ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకొని సొమ్మును రికవరీ చేసినట్లు సీఐ బాలరాజు తెలిపారు. బుధవారం కే సుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. గత నెల 28వ తేది మధ్యాహ్నం 2గంటల సమయంలో రాజీవ్‌నగర్ సమీపంలో నివాసముంటున్న నాగరాజు అనే ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తు లు దొంగతనానికి పాల్పడి దాదాపు 6 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లా రు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పాత నేరస్తుడైన మొండి కృష్ణ అలియాస్ కీచు గత నెల షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో దొంగతనం కేసులో అరస్టై విడుదలయ్యాడు. అతని కదలికలపై నిఘా పెట్టడంతో ఇటీవల ఖ ర్చులు ఎక్కువ చేస్తున్నాడన్న సమాచారం తో అతడిని విచారించగా బాదేపల్లి అయ్య ప్పస్వామి ఆలయం సమీపంలోని ఇంట్లో చోరీ చేసిన ఘటన వివరాలను తెలయజేశాడన్నారు. దీంతో నాగరాజు ఇంట్లో పో యిన నల్ల పూసల దండ 3.5 గ్రాములు, వంకు 5 గ్రాములు, బుట్టాలు 8 గ్రాము లు, ప్యూర్ గోల్డ్ 15 గ్రాము లు రికవరీ చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్ చేసి, ఈ కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు బేగ్, శేఖర్, పవన్, మల్లికార్జున్‌లను సీఐ అభినందించారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...