వ్యక్తిపై హత్యాయత్నం


Thu,June 20, 2019 02:15 AM

జడ్చర్ల రూరల్ : తమ చుట్టాల ఇళ్లు అద్దేకిచ్చాడనే కోపంతో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం జడ్చర్లలోని ఇండస్ట్రీయల్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ బాల్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన కుటుంబంతో సహ హైదరబాద్‌కు మారిపోతుండగా ఇంటిపక్క నివాసముంటున్న ప్రశాంత్‌కుమార్ అనే వ్యక్తి తన ఇంటిని అప్పజెప్తు ఇళ్లు మంచివారికి అద్దెకివ్వాలని సూచించారు. కాగా ఇటీవల ప్రశాంత్ కుమార్ ఆ ఇంటిని మంగళి శ్రీను అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. ఇది జీర్ణించుకోలేని కృష్ణారెడ్డి తమ్ముడి కొడుకు పవన్‌రెడ్డి తన మిత్రుడైన పురుషోత్తంతో కలిసి మంగళవారం రాత్రి ఇండస్ట్రీయల్ ప్రాంతలో ప్రశాంత్‌కుమార్‌ను పట్టుకుని బీరు సీసతో తలపై కొట్టడంతో పాటు కడుపులో నాలుగు పోట్లు పొడిచినట్లు తెలిపారు. బాధితుడిని దవాఖానకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...