యువకుడి ఆత్మహత్య..


Thu,June 20, 2019 02:15 AM

తెలకపల్లి : మండలంలోని దాసుపల్లి గ్రామంలో మంగళవారం గణేశ్(25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. కాగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మొహరించారు. ఏఎస్సై రేణయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... దాసుపల్లికి చెందిన గణేశ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులు ఆ యువతికి వేరే పెళ్లి సంబంధం కుదుర్చారు. ఈ యువకుడు ఆ సంబంధాన్ని చెడగొట్టాడని యువతి తల్లిదండ్రులు గణేశ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గణేశ్‌పై కేసు నమోదు చేయడం జరిగింది. గణేశ్‌ను సదరు యువతితో పాటు వారి కుటుంబ సభ్యులు అవమానించి, తిట్టి బెదిరించినందుకు అతను పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంగళవారం మహబూబ్‌నగర్ తీసుకుపోగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. యువతి, యువకుల ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. బుధవారం సాయంత్రం గణేశ్ మృతదేహాన్ని దాసుపల్లికి తరలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు యువతితో పాటు వారి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎల్లమ్మ, నర్మద, నిర్మల, బాలస్వామి, చెన్నయ్య, వీరస్వామి, లక్ష్మయ్య, సలీంలపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రేణయ్య తెలిపారు. యువకుడి మృతదేహం బుధవారం సా యంత్రం తరలించగా అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొనడంతో నాగర్‌కర్నూల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి భారీగా పోలీసులను మొహరింపజేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...