ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి


Wed,June 19, 2019 02:19 AM

- కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో సమావేశమైన
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకుగాను దేవరకద్ర నియోజకవర్గానికి మంజూరైన ఇళ్ల నిర్మాణాల్లో మరింత వేగం పెంచి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ దృష్టికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తీసుకొచ్చారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల కలెక్టర్‌తో సమావేశమై పలు విషయాలను వివరించారు. నిజలాపూర్‌లో మొత్తం 97 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 20 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని మరో 77 ఇళ్లు తుది దశకు చేరుకోవడం జరిగిందని వివరించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వేగం పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 880 ఇళ్లు నిర్మించాల్సి ఉందని, ఈ నిర్మాణాలు మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని, నిబంధనల మేరకు రాయితీలను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాలతోపాటు నియోజకవర్గంలోని పలు సమస్యలపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే ఆల తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్‌ శాఖ జిల్లా అధికారి రమణరావు, తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...