విడాకుల పేరుతో మోసగిస్తున్న వ్యక్తి అరెస్ట్‌


Tue,June 18, 2019 01:35 AM

- మోటర్‌ వెహికిల్‌ సీజ్‌
-వ్యక్తి రిమాండ్‌
వనపర్తి విద్యావిభాగం: విడాకుల తీసు కున్న మహిళల్ని అసరాగా తీసుకొని వివా హాలు చేసుకుంటానని మోసగిస్తున్న వ్యక్తి వలపన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం సీఐ సూర్యనాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పోతన కాలనీకి చెందిన చంద్రశేఖర్‌కు వివాహాం కాగా తెలుగు మాట్రిమోనిలో నమోదు చే సుకొని విడాకులు తీసుకున్న మహిళలతో పరిచయం చేసుకొని వారి బలహీనతలను అసరాగా చేసుకొని ట్రాపింగ్‌ చేస్తు మోసాలకు పాల్పడుతున్నా డు. ఈ నెల 14న వన పర్తికి చెందిన ఓ మ హిళలతో తనకు 34 సంవత్సరాలని వివాహమై విడాకులు తీసుకున్నానని, తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రర్‌ చేసుకొని పరిచ యం చేసుకొని ఫొన్‌ సంభాషణ మొదలుపెట్టాడు. వనపర్తికి చెందిన ఓ మహిళను సెప్టెంబర్‌ మాసంలో పరిచయం చేసు కొని మాయమాటలు చెప్పి తాను సామ్‌ సంగ్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేస్తున్నానని నమ్మ బలికాడు.

రూ.2లక్షల పెట్టుబడి పెడితే దా నికి రూ.1లక్ష30వేలు అదనపు ఆదాయం వస్తుందని అందుకు పెట్టుబడికి కావాల్సిన సహాయం చేయాలని నమ్మించి మొదటగా రూ.3లక్షలు, తర్వాత రూ.6లక్షలు ఆ తర్వాత రూ.70వేల చొప్పున వనపర్తికి చెందిన మహిళతో వసూలు చేశాడు. వివాహం చేసుకోవాలని మహిళ ఒత్తిడి చేయ్యడంతో తన కుటుంబంలో బంధువు లు చనిపోయారని, ఆ తతాంగ మంతా పూర్తయ్యాక కుటుంబ సభ్యులతో కలిసి వి వాహాం చేసుకుందామని నమ్మిం చాడని చెప్పారు. అదేవిధంగా మహిళలతో ఉన్న 8 గ్రాముల బంగారు గోలుసు కూడా మాయ మాటలతో పెట్టుబడికోసం తీసుకున్నాడు. చివరకు మహిళతో సంభాషణ చేస్తు వనపర్తికి వచ్చి కలుస్తానని చెప్పడంతో పోలీసు లు వలపని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద అతడ్ని పట్టుకున్నారు. మహిళల చె ప్పిన వివరాలన్ని ఆడుగగా తాను జూదా నికి అలవాటు పడ్డానని మహిళతో డబ్బులు తీసుకున్నానని దాంతోనే ద్విచక్రవాహనం కొన్నానని ఒప్పుకున్నాడు. బాధితురాలు ఇచ్చిన ఫి ర్యాదుమేరకు అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అదే విధంగా మధ్యప్రదేశ్‌, రాజమండ్రి, వైజాగ్‌ ప్రాంతాల్లో కూడా మరికొందరి మహిళలను కూడా ఇలాగే ట్రాప్‌లో వేసి మోసగించాడని సీఐ చెప్పాడు. అతడి వద్ద నుంచి ద్విచక్రవాహనం, చైన్‌ సీజ్‌ చేశామని సీఐ తెలిపారు. ఈ కార్యక్ర మంలో రేవల్లి ఎస్సై వెంకటేశ్‌గౌడ్‌, శిక్షణ ఎస్సై ఉమా తదితరులు ఉన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...