ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలి


Tue,June 18, 2019 01:34 AM

-హరితహరాన్ని విజయవంతం చేయాలి
-సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు
నారాయణపేట టౌన్‌ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజావాణికి సంబందించి 176 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని ఇందులో పేట జిల్లాకు సంబంధించిన ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకట్రావు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీవోలు, తాసిల్దార్‌లు, ఈవోపీఆర్‌ డీలతో కలెక్టర్‌ మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని అధికారులు సందర్శించి ఎప్పటికప్పుడు గ్రామంలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. పేట జిల్లాలో మొత్తం 184.64లక్షల హరితహారం మొక్కల పెంపకమే లక్ష్యంగా అధికారులు ముం దుకు సాగాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి ఈజీఎస్‌ ద్వారా సహకారం తప్పక అందించాలన్నారు. హరితహరం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖకు 20 లక్షలు, ఉద్యానవన శాఖకు 10లక్షలు, సెరికల్చర్‌ శాఖకు 5లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ప్రతి మండలానికి లక్ష చొప్పున మొక్కలను పెంచాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా అటవీశాఖ అధికారి గంగిరెడ్డి, డీఆర్‌డీవో రఘువీరారెడ్డితో పాటు జిల్లా పరిధిలోని అధికారులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...