నిర్వాసితులకు అండగా ఉంటా..


Tue,June 18, 2019 01:34 AM

-పాలమూరు నిర్వాసితులకు న్యాయం చేస్తాం
-నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
-శ్రీపురం, లక్ష్మాపురం, బొందలపల్లి గ్రామాల రైతులకు చెక్కుల పంపిణీ
-కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ
నాగర్‌కర్నూల్‌ రూరల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అ న్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూ ములు కోల్పోతున్న రైతులకు మంజూరైన నష్ట పరిహారం చెక్కులు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాయలం లో రైతులకు అందజేశారు. ఈమేరకు మండలంలోని శ్రీపురం, లక్ష్మాపురం, బొందలపల్లి గ్రామాలకు చెందిన 18 మంది రైతులకు రూ.60లక్షల రూపాలయ విలువ చేసే చెక్కులను రైతులకు అందజేశారు. నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేమున్నాం అంటూ భోరోసానిచ్చారు. ఇదిలా ఉండగా నాగర్‌కర్నూల్‌ పట్టణం తో పాటు మండలంలోని గగ్గలపల్లి, నాగనూల్‌, వనపట్ల, నల్లవెల్లి, ఎండబెట్ల, పెద్దాపూర్‌ గ్రామాలకు చెందిన41 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మం జూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధ్దిదారులకు అందజేశారు.కార్యక్రమంలో తాసిల్దార్‌ లక్ష్మి నారాయణ, డిప్యూటీ తాసిల్దార్‌ ఖామైనొద్దిన్‌, కొత్త జెడ్పీటీసీ శ్రీశైలం, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ వెంకటయ్య, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...