పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య


Tue,June 18, 2019 01:34 AM

-నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
-బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం
నారాయణపేట, నమస్తే తెలంగాణ : పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి మంజూరైన బీసీ బాలికల గురుకుల పాఠశాలను సోమవారం నారాయణపేట కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యమైన ఘట్టమని, దేశ చరిత్రలోనే ఒకేరోజు 119 ప్రభుత్వ గురుకు ల పాఠశాలలను ప్రారంభించడం అద్భుతమైన, అరుదైన రికార్డు అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం ఎంతో అభినందనీయమన్నారు. గతంలో హాస్టళ్లు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసతులు ఉండేవి కావని, నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేస్తున్న గురుకుల హాస్టళ్లలో అన్ని వసతులతో మెరుగైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షా 23వేలను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు.

విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నంతగా దేశంలో మరెక్కడ కూడా లేదన్నారు. తాత్కాలిక భవనంలో ఇంకా ఏర్పాట్లు చేయాల్సి ఉందని, వాటిని ఈనెల 25లోపు పూర్తి చేయాలని, 25న మధ్యాహ్నాం కలెక్టర్‌తో కలిసి తాను హాస్టల్‌లో భోజనానికి వస్తానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంకట్రావు మాట్లాడుతూ వాస్తవంగా కోటకొండలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడ స్థలభావం కారణంగా నారాయణపేటలో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే కోటకొండలో శాశ్వత గురుకుల పాఠశాల భవన నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను ఎమ్మెల్యే, కలెక్టర్‌ అందజేశారు. అలాగే, గురుకుల హాస్టల్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ వనజ, జెడ్పీ వైస్‌ చై ర్మన్‌ సురేఖ, కోటకొండ సర్పంచ్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ గందె అనసూయ చంద్రకాంత్‌, ఎంపీపీ మణెమ్మ, జెడ్పీటీసీ అరుణ, ఇటీవల గెలుపొందిన ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సరాఫ్‌ నాగరాజు, వైస్‌ చైర్మన్‌ అమ్మపల్లి చెన్నారెడ్డి, గురుకుల ప్రిన్సిపల్‌ కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్‌ నాయకులు సుంకిని వెంకటేశ్వర్‌రెడ్డి, వేపూరి రాములు, కోట్ల జగన్మోహన్‌రెడ్డి, గందె చంద్రకాంత్‌, కన్న జగదీశ్‌, గుండుమల్‌ ప్రతాప్‌రెడ్డి, కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, నారాయణ, విజయ్‌సాగర్‌, యాంకి హన్మంత్‌రెడ్డి, గుర్నాథ్‌గౌడ్‌, సతీశ్‌, రాజు, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...