కల్యాణం.. కమనీయం


Tue,June 18, 2019 01:33 AM

-గోవింద నామస్మరణ మధ్య రథంపై ఊరేగిన శ్రీవారు
అయిజ : వేద పండితుల మంత్రోచ్ఛరణలు.. భక్తుల గోవింద నామస్మరణలు.. మంగళ వా యిద్యాల నడుమ వేంకటేశ్వరస్వామి కల్యా ణం కమనీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరు గ్రామంలో వెలసిన ధన్వంతరి వేం కటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆలయం లో శ్రీదేవి, భూదేవిలతో ధ న్వంతరి వేంకటేశ్వర స్వామికి కల్యా ణం వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారిని రథంపై ఆశీనులను చేసి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని దశి మి క ట్ట వరకు రథాన్ని లాగి, ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చా రు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కల్యాణా న్ని కనులారా చూసి తరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతోపా టు, అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...