వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి


Mon,June 17, 2019 03:17 AM

గోపాల్‌పేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తం గా ఆయా దేశాల్లో రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని, స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రభుత్వ సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...