కవిత్వం.. సమాజానికి దిక్సూచి


Mon,June 17, 2019 03:16 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : సమాజాన్ని జాగృతం చేసేది కవిత్వమని, అలాంటి కవిత్వాలు రచయితల నుంచి విస్తృతంగా రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన మొగ్గలకవి ఉప్పరి తిరుమలేష్ రచించిన తొలకరి జల్లు కవితాపుస్తకాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ముందుగా రచయిత మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి తిరుమలేష్, పుస్తక విడుదలకు సహకరించిన దాతలను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసేలా రచనలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు గట్టుయాదవ్, కౌన్సిలర్ వాకిటి శ్రీధర్, రమేష్ నాయక్, పుస్తక సమీక్షకులు బోల యాదయ్య, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ గుంటి గోపి, నాగవరం బాలరాం, డాక్టర్ వీరయ్య, శంకర్‌గౌడ్, నారాయణ రెడ్డి, తిరుపతయ్య సాగర్, నరేష్ కుమార్ , తోటశ్రీను తదితరులు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...