పత్తి దుకాణాల్లో విజిలెన్స్‌ దాడులు


Sun,June 16, 2019 02:24 AM

భూత్పూర్‌: భూత్పూర్‌ మున్సిపాలిటీ కేంద్రంలో విజిలెన్స్‌ సీటీ2, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. శనివారం రాత్రి తెలంగాణ రిసెర్చ్‌, విజయశ్రీ, శ్రీరామ దుకాణాల్లో తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో కర్నూల్‌ జిల్లాకు చెందిన ఇండిగో క్రాప్‌ కేర్‌ సీడ్స్‌ కంపెనీకి చెందిన పోచ్‌లు పట్టుబడ్డాయి. ఈ సందర్బంగా విజిలెన్స్‌ సీఐ నర్సింహరాజు మాట్లాడుతూ విజిలెన్స్‌ ఎస్పీ చిట్టిబాబు ఆదేశాల మేరకు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఇండిగో క్రాప్‌ కేర్‌ సీడ్స్‌ కంపెనీ కర్నూల్‌కు చెందిన కంపెనీ ఈ కంపెనీలో మహేష్‌ అనే వ్యక్తి ఉద్యోగిగా పనిచేసేవాడు. 2018సీజన్‌ అనంతరం కంపెనీ యజమాని పత్తి కంపెనీని వదులుకుంటున్నట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీలో ఉద్యోగిగా విధులను నిర్వహించిన మహేష్‌ కర్నూల్‌కు చెందిన అలిసాబ్‌తో కలిసి పత్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు రైతులకు తెలిపారు. ఇండిగో క్రాప్‌కేర్‌ సీడ్స్‌ పోచ్‌(కవర్లు) వాడినట్లు ఆయన తెలిపారు. ఈ సీడ్స్‌ను భూత్పూర్‌లోని ఈ దుకాణాల్లో అమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడి రైతులకు తీవ్ర మోసం చేస్తున్న మహేష్‌ను స్వాదీనం చేసుకొని భూత్పూర్‌ పోలీసులకు అప్పజెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీకి సంబందిన లీడర్‌, రుద్ర వెరైటీల విత్తనాలను 5,500ప్యాకెట్ల సీజ్‌ చేపినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ రూ.40,5000లు. రైతులు ఎవ్వరైనా విత్తనాలను కొనే ముందు కర్నూల్‌కు చెందిన విత్తనాలను కొనకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్‌ ఏవో మల్లారెడ్డి, దేవరకద్ర ఏడీఏ యశ్వంత్‌రావు, ఏవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...