అపర భగీరథుడు.. కేసీఆర్‌!


Sun,June 16, 2019 02:23 AM

- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపరభగీరథుడు, ఆయన ఉన్నంత వరకు ఏ ఒక్కరు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందని వి. విజయమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె హైదరాబాద్‌లోని గ్లోబల్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు అవసరమైన రూ.60వేల ఎల్‌వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బాధితురాలి భర్త మురలయ్యకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర సమయాలతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుత్ను ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలుస్తూ వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం కార్పోరేట్‌ దవాఖానల్లో కూడా వైద్యం చేయించుకునేందుకు వీలుగా సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తూ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఎల్‌వోసీలను అందజేస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆర్థికంగా ఆదుకుంటూ ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కావున ఆయన ఉన్నంత వరకు ఏ ఒక్క పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు బాధ, భయపడాల్సిన అసవరం లేదని ఎమ్మెల్యే చెప్పారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...