వనపర్తి జిల్లా దవాఖానలో కార్పొరేట్‌ సేవలు


Sun,June 16, 2019 02:23 AM

వనపర్తి వైద్యం: వనపర్తి జిల్లా దవాఖానలో పెబ్బేర్‌ మండలం బునాధిపురం గ్రామానికి చెందిన బాలమ్మకు ఖరీదైన శస్త్రచికిత్స చేసినట్లు శనివారం జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ రాము అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాము మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన బాలమ్మ దవాఖానలో గ్యాస్‌ట్రబుల్‌తో బాధపడుతున్నాని చెప్పింది. దాంతో ఆమెకు పరీక్షలు చేయగా గ్యాస్ట్రోజిజానాస్టమీ విత్‌ వ్యాగాటమి అనే వ్యాధి బారన పడినట్లు తెలిసింది. ఈ వ్యాధికి సంబంధించి కార్పొరేట్‌ దవాఖానల్లో రూ.2లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆమెకు చెప్పగా, ఆమె శస్త్రచికిత్స చేయించుకోనని కోరిందని తెలిపారు. ఈ వ్యాధితో ఏడాదిగా వివిధ దవాఖానల్లో తిరిగి తిరిగి వనపర్తి దవాఖానకు వచ్చిందని, దీంతో ఆమెకు సర్జన్‌ చేస్తానని భరోసా ఇవ్వడంతో ఆమె సంతోషపడిందన్నారు. ఈ ఆఫరేషన్‌ విజయవంతంగా జరిపించడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. శనివారం మెను డిస్‌చార్జి చేసినట్లు డాక్టర్‌ తెలిపారు. గతంలో గొంతుకు కంతి కావడంతో ఆమెకు ఆఫరేషన్‌ చేయడంతో ఎంతో నయమైందని తెలిపారు. డాక్టర్‌ రామును దవాఖాన వైద్యులు, సిబ్బంది అభినందించారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...