అభివృద్ధిని చూసి ఆదరిస్తున్నారు


Sun,June 16, 2019 02:23 AM

మధ్యాహ్నాం 2:30 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందన్నారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి ప్రజలు కళ్లముందు కనిపిస్తుందని, మళ్లీ అధికారంలోకి వచ్చామని, ఈ ఐదేళ్లలో పాలమూరు జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. కర్వెన ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్‌నగర్‌ మండలంలోని అన్ని గ్రామాల చెరువులు నింపి, వ్యవసాయానికి నీరు అందిస్తామన్నారు. పాలమూరు రాష్ట్రంలోనే అభివృద్ధి జిల్లాగా మార్చేంత వరకు నిద్రపోనని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పాలమూరుకు గతంలో ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదని తెలంగాణ ఏర్పడ్డాక పాలమూరు జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాడం ఆంజనేయులు, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీలు రవీందర్‌రెడ్డి, వెంకటయ్య, నాగరాజు, మాధవి, వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...