ముగిసిన వరుణయాగం


Sun,June 16, 2019 02:23 AM

-ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీ చైర్‌ పర్సన్‌ వనజా ఆంజనేయులుగౌడ్‌
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
మక్తల్‌ రూరల్‌ : మక్తల్‌ మండలంలోని పంచదేవ్‌పహాడ్‌ శ్రీపాదఛాయ ఆశ్రమంలో చేపట్టిన వరుణయాగం శనివారం నిర్వహించిన పూర్ణాహు తి కార్యక్రమంతో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి చింత శ్రీపతిస్వామీజీ ఆధ్వర్యంలో దత్తాత్రేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి భజన సంకీర్తనలను ఆలపించారు. ఈ నెల 7నుంచి ప్రారంభించిన ఈ వరుణయాగం మొత్తం 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని శ్రీపతిస్వామీజీ అన్నారు. నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఇటీవల ఎన్నికైన కే వనజా ఆంజనేయులుగౌడ్‌ శనివారం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని దత్తప్రభువుకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పట్టు వస్ర్తాల తో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నూతన ఎంపీపీ వనజమ్మ, పంచదేవ్‌పహాడ్‌ సర్పంచ్‌ కల్పన, పస్పుల సర్పంచ్‌ దత్తప్పతో పాటు భక్తులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...