ఉత్సాహంగా బడిబాట


Sat,June 15, 2019 02:29 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ :బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని బోయపల్లి, ఎదిర, ఏనుగొండ, షాషాబ్‌గుట్ట, అప్పన్నపల్లి, బండమీదిపల్లి, న్యూటౌన్ తదితర ప్రాంతాల పాఠశాలల విద్యార్థులచే అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 100మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ రత్‌చంద్ర, ఏఎంవో హేమచంద్రుడు, ఎంఈవో జయశ్రీ, కాంప్లెక్స్ జీహెచ్‌ఎం వసంత యామిని, సీఆర్పీ శ్రీనివాసులు, నాయకులు నర్సింహులు, పత్తి వెంకట్రాములు, వెంకటస్వామి, సంజీవ్‌గౌడ్, అబ్దుల్ హక్ పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...