జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్‌కు ఎంపిక


Sat,June 15, 2019 02:28 AM

వనపర్తి క్రీడలు : ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో జరిగే జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్‌కు రాష్ట్రం నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోలమోని కుమార్ శుక్రవారం తెలిపారు. ఎంపికైన వారిలో మల్లేష్, నరసింహ, వెంకటేష్, నవీన్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ జట్టుకు ఎంపికైన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోటూరు శ్రీనివాస్‌గౌడ్, సభ్యులు రాంమోహన్, వహీద్, కార్తీక్, హాకీ క్రీడాకారులు అభినందించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...