మొక్కల ఎదుగుదలపై జీవామృతం ఉపయోగించండి


Sat,June 15, 2019 02:27 AM

నర్వ : జీవామృతాన్ని ఉపయోగిం చడం వల్ల తక్కువ కాలంలోనే మొక్కలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి అవకాశ ముందని నారాయణపేట జిల్లా డీప్యూటీ ఫారెస్టు ఆఫీసర్ రఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో హరితహారం కోసం మొక్కలు పెంచుతున్న వనసేవకులకు జీవామృతం ఉపయోగంపై అవగాహన కల్పించారు. నీరు, ఆవుపేడ, ఆవుముత్రం, నల్లబెల్లం, శనగపిండి, పుట్టమన్ను, యూరియా, డీఏపీ, వేపపొడిలాంటి తొమ్మిది వస్తువులను ఒక డ్రమ్ములో నానబెట్టి జీవామృతం తయారు చేసుకోవాలన్నారు. అనంతరం ఈ జీవమృతాన్ని మొక్కలపై పిచికారి చేయడం వల్ల కొద్దిరోజుల్లోనే మొక్కలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయని అ న్నారు. ఈ జీవామృతం హరితహారం కోసం పెంచుతున్న మొక్కలకు ఉపయోగించడం ద్వారా ఎన్నో సత్ఫలితాలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌కుమార్, జిల్లా ప్లాంటేషన్ సూపర్‌వైజర్ అనిత, ఏపీవో ఎల్లయ్య, ఆయా గ్రామాల ఎఫ్‌ఏలు, టీఏలు, వన సేవకులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...