జూలై 11లోపు హరితహారానికి సన్నద్దం కండి


Sat,June 15, 2019 02:27 AM

-ఉపాధి హామి కూలీల డబ్బులు విడుదల
-వీసీలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూప్రసాద్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : వచ్చే నెల 11వ తేదీలోపు హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా డ్వామా అధికారులతో ఆమె మాట్లాడారు. గతంలో నాటిన మొక్కలు ఎక్కడైతే చనిపోతాయో వాటి స్థానంలో నూతన మొక్కలు నాటాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు అధిక మందికి పని కల్పించాలని, వీరికి పెండింగ్‌లో ఉన్న డబ్బులు కూడా విడుదల చేశామన్నారు. నిబంధనల మేరకు కూలీలకు డబ్బులు చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి డ్వామా అధికారులు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, జకియాసుల్తానా, సరళ తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...