నేడు మహబూబ్‌నగర్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక


Sat,June 15, 2019 02:27 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్ల ఎన్నికలు శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తామని ఎన్నికల ప్రొసిడింగ్ అధికారి పెర్కి యాదయ్య తెలిపారు. ఎన్నికల నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని, అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. ఉదయం 9 నుంచి 10 గంటల లోపు కోఆప్షన్ నామినేషన్ దరఖాస్తు చేయాలని, 10 నుంచి 12 గంటల వరకు స్క్రూటినీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు కోఆప్షన్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ఎంపీపీ, వైఎస్ ఎంపీపీల ఎన్నిక నిర్వహించి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...