16 నుంచి డిగ్రీ, బీఈడీ, స్పెషల్‌బీఎడ్ అర్హత పరీక్ష


Sat,June 15, 2019 02:27 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ, స్పెషల్ బీఎడ్ అర్హత పరీక్ష ఈనెల 16న ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మహబూబ్‌నగర్ స్టడీ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ కనకదుర్గ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, బీఈడీ, ప్రవేశ పరీక్ష ఈనెల 16న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, స్పెషల్ బీఏడ్ అర్హత పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు www.braou online.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. పరీక్షకు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకు రావాలని ఆమె సూచించారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...