పది సప్లిమెంటరీ పరీక్షకు 813 మంది హాజరు


Sat,June 15, 2019 02:27 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : పది సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 11, నారాయణపేట 4 మొత్తం 15 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటలకు నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు పరీక్షలు కొనసాగాయి. ఐదవ రోజు 1044 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, ఇందులో 813 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 231 విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల కేంద్రాలను అధికారులు, 6 స్వాడ్ బృందాలు పరిశీలించాయి.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...