పశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి


Fri,June 14, 2019 03:20 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : గొర్రెలు, పా డి పశువుల ఆరోగ్య సంరక్షణపై పశు సంవర్ధక శాఖ అ ధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా పశు సం వర్ధక శాఖ జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గొర్రెలు, పాడి పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశు సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అధికారులు అందుకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వానాకాలం ప్రారంభమైన సం దర్భంగా నూతనంగా పెరిగే గ్రాసాన్ని పశువులు తీసుకోవడంవల్ల వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పశువుల ఆరోగ్యం సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 18 నుంచి 25 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామా ల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాగించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పశు వైద్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా గ్రామాలు సందర్శించే వి ధంగా చూడాలని సూచించారు. పాడి పశువులలో గొం తు వాపు, జబ్బవాపు, గొర్రెలలో చిటుక వ్యాధికి టీకా లు ఇవ్వాలని తెలిపారు. పశు సంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా మాట్లాడుతూ పశు వైద్య శాలల నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. అ నంతరం పశు సంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమా ర్, అదనపు సంచాలకులు డాక్టర్ ఎస్.రాంచందర్, వీ.లకా్ష్మరెడ్డి, జీ.మంజువాణిలు వీసీ ద్వారా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం జిల్లా పశు వైద్యాఅధికారి డాక్టర్ గంధం దుర్గయ్య మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో 46, నారాయణపేట జిల్లాలో 30 పశు వైద్య బృందాలను ఏర్పా టు చేశామని, అన్ని గ్రామాల్లో నట్టల నివారణ మందు లు తాగించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...