బాలుర కళాశాలలో కోఎడ్యుకేషన్ ప్రారంభం


Fri,June 14, 2019 03:17 AM

జడ్చర్లటౌన్ : జడ్చర్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బాలురతో పాటు బాలికలకు కూడా ప్రవేశ అనుమతులు లభిస్తున్నాయి. తద్వారా బాలురతో పాటు బాలికలకు కూడా ఇక్కడ విద్యాబోధనలు అందనున్నాయి. జడ్చర్ల ప్రభుత్వ బాలుర కళాశాలను కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలగా మార్పు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు బాలుర కళాశాల కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలగా మారింది. ఈ ఏడాది నుంచే ఈ కళాశాలలో బాలురతో పాటు బాలికల ప్రవేశాలకు అనుమతి ఇస్తుండటంతో జడ్చర్ల పరిసర ప్రాంతాల్లోని ఇంటర్మీడియట్ చదుకోవాలన్న బాలికలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం జడ్చర్లలో ప్రత్యేక బాలికల కోసం ఒక్కటే ప్రభుత్వ కళాశాల కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉన్న బాలికల కళాశాలలో అడ్మీషన్ దొరకని పలువురు విద్యార్థినులు ప్రైవేటు కళాశాలలో ప్రవేశాలు పొందేవారు. దీంతో బీద, మధ్య తరగతి విద్యార్థినులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కానీ ఈ ఏడాది నుంచి బాలుర జూనియర్ కళాశాలలో కూడా బాలికలకు అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వటంతో ఏదో ఓ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ లభిస్తోందని విద్యార్థినులు ఆశిస్తున్నారు.

కళాశాలలో బాలికల ప్రవేశానికి అనుమతులు
బాలుర జూనియర్ కళాశాలను కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలగా మారుస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య తెలిపారు. ఈ ఏడాది నుంచి బాలురతో పాటు బాలికలకు ప్రవేశ అనుమతులు చేస్తున్నాం. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సు లతో పాటు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన వసతి, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. అంతే కాకుండా ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధనలు అందిస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలగా మారటంతో బాలికలు ఇక్కడ అడ్మిషన్లు తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...