తండాలకు మహర్దశ : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


Thu,June 13, 2019 01:49 AM

రేవల్లి : రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగి యడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రేవల్లి మండల పరిధిలోని తల్పునూర్ తండాకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పనులను ఆయన అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెంచిన పింఛన్లు, రైతుబంధు డబ్బులు 57 ఏండ్లు నిండిన వారికి నూతన పింఛన్లు, భూ రికార్డుల ప్రక్షాళన తదితర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల చెంతకు రానున్నాయని చెప్పారు. తండాలు, పల్లెల్లో స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు తాను నేరుగా పల్లెనిద్రలు చేసి వారి సమస్యలను తెలుసుకొని అక్కడికిఅక్కడే వాటి అధికారులతో మాట్లాడి పరిష్కరించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా వచ్చేవారం తల్పునూర్ తండాలో బస చేయనున్నట్లు తండావాసుల కరచాల ధ్వనుల మధ్య ప్రకటించారు.
మరికోద్ది రోజుల్లోనే ప్రతి గ్రామం శుభ్రం అనే కార్యక్రమం ద్వారా ఉద్యమంలా ప్రతి ఊరు పరిశభ్రం కానుందని, అందుకు ప్రతి గ్రామానికి యేడాదికి 15 నుంచి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, గిరిజన సంక్షేమ శాఖ సీఈ శంకర్‌రావు, ఎస్‌ఈ మురళీ కృష్ణ, ఈఈ వసంత, డీఈ వెంకటేశ్వరసింగ్, ఏఈ రఘు, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ భీమయ్య, ఎంపీపీ బంకల సేనాపతి, వైస్ ఎంపీపీ మధుసూ దన్‌రెడ్డి, పాత తండా, చెన్నారం, బండరాయిపాకుల, తల్పునూర్, గొల్లపల్లి సర్పంచులు అమ్లావత్ గౌడ నాయక్, రమేశ్, లచ్చమ్మ, నరేందర్‌రెడ్డి, సునీల్‌కుమార్, ఎంపీటీసీలు కుర్మత్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్, నాయకులు పాల్గొన్నారు

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...