నేడు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు


Thu,June 13, 2019 01:48 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలో బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఈ నెల 18 నుంచి 28 వరకు నంది టైర్స్ సహకారంతో మహబూబ్ నగర్ ప్రీమియర్‌లీగ్-5 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీఎల్-5 లో 10జట్లతో టోర్నీ నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 10 జట్ల ఓనర్లు పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఎంపీఎల్ టోర్నీ కోసం నేడు (గురువారం) జిల్లా కేంద్రంలోని బోయపల్లి శివారులోని హెచ్‌సీఏ మైదానంలో ఉదయం 10 గంటల నుంచి 5గంటలకు ఎంపికలు నిర్వహిస్తున్నామని, అండర్-25లోపు క్రీడాకారులు హాజరుకావాలని కోరారు. టోర్నీలో గ్రామీణ క్రీడాకారులకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల క్రీడాకారులు ఎంపికలకు హాజరుకావాలని కోరారు. ఎంపికలకు క్రీడాకారులు ఒరిజన్ ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణపత్రం, 2 ఫొటోలు తీసుకొని హాజరుకావాలని సూచించారు. వైట్ డ్రెస్, షూ తప్పనిసరి అన్నారు.

ఈనెల 15 నుంచి దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు
పాలమూరు యూనివర్సిటీ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలలయం దూరవిద్య డిగ్రీ, పీజీ వార్షిక పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుంచి స్థానిక ఎన్‌టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వాహించడం జరుగుతుందని స్వామి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల కో-ఆర్డినేటర్ కే.షణిప్రసాద్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరై విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.anucde.info వెబ్‌సైట్ నుంచి పొందగలరని తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...