అంతర్జాతీయ పోటీలకు విద్యార్థిని ఎంపిక


Thu,June 13, 2019 01:48 AM

గద్వాలటౌన్ : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలలోని కాకతీయ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న సౌమ్య అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్ అండర్-14 పోటీలకు ఎంపికైంది. ఇందుకు గాను పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ విద్యార్థిని బుధవారం పాఠశాలలో సన్మానించారు. గత నెల చెన్నైలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో సౌమ్య ఉత్తమ ప్రతిభ కనబరచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీలలో సౌమ్య పాల్గొంటుందని తెలిపారు. అంతర్జాతీయ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే సౌమ్యకు మెరుగైన శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎందిగేందుకు కృషి చేసిన కోచ్ శ్రీహరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్‌తో పాటు పాఠశాల డీన్ సౌజన్య, ప్రిన్సిపాల్ సౌజన్యలు విద్యార్థిని సన్మానించి అభినందించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...