అక్షయపాత్రతో మధ్యాహ్న భోజనం


Thu,June 13, 2019 01:47 AM

నవాబ్‌పేట/దేవరకద్ర రూరల్/అడ్డాకుల/కోయిలకొండ : అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్ర భుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం బుధవారం ప్రారంభమైంది. నవాబ్‌పేట కేం ద్రంగా నవాబ్‌పేట మండలంతోపాటు చిన్నచింతకుంట, దేవరకద్ర, భూత్పూర్, కోయిల్‌కొండ మండలాల ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక వాహనాల్లో మ ధ్యాహ్న భోజనాన్ని తరలించారు. దేవరకద్ర మండలంలోని 11 ఉన్నత, 8 ప్రాథమికోన్నత, 28 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి నారాయణరెడ్డి తెలిపారు. అలాగే, అడ్డాకుల మండలంలోని కం దూరు, పొన్నకల్, బలీదుపల్లి, రాచాల, అడ్డాకుల ఉ న్నత పాఠశాలల విద్యార్థులకు అక్షయపాత్ర పౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందించా రు. అదేవిధంగా కోయిలకొండ మండలంలోని 76 పాఠశాలకు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించామని ఎంఈవో రాములు తెలిపారు. కాగా, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...