ఆర్డీఎస్‌కు 5.005 టీఎంసీలు


Wed,June 12, 2019 02:49 AM

-కేసీ కెనాల్‌కు 7.689 టీఎంసీల నీటి కేటాయింపు
-163 టీఎంసీలు టీబీ డ్యామ్‌కు వస్తాయని టీబీ బోర్డు అంచనా
-తుంగభద్ర పరివాహక ప్రాంత రాష్ర్టాలకు 212 టీఎంసీలు కేటాయించిన కేడబ్ల్యూడీటీ
-తుంగభద్ర బోర్డు సమావేశంలో నిర్ణయం
అయిజ : ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 5.005 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు నిర్ణ యం తీసుకున్నది. కర్ణాటకలోని టీబీ డ్యామ్‌కు వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి 2019-20 ఏడాదికి 163 టీఎంసీలు వస్తాయని బోర్డు అధికారులు, ఇంజినీర్లు అంచనా వేశారు. 163 టీఎంసీలను తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు కేడబ్ల్యూడీటీ కేటాయింపులకు అనుగుణంగా నీటి కేటాయింపులు జరిపారు. మంగళవారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ అతిధి గృహం లో తుంగభద్ర బోర్డు కార్యదర్శి నాగశేషు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన ఎస్‌ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా బోర్డు కార్యదర్శి నాగశేషు మాట్లాడుతూ. తుంగభద్ర పరివాహక రాష్ర్టాలకు కేడబ్ల్యూడీటీ 212 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు నీటి కేటాయింపులు చేసిందన్నారు. కర్ణాటకకు 138.990, ఏపీకి 66.500, ఆర్డీఎస్‌కు 6.510 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. గత నా లుగైదు ఏళ్లుగా తుంగభద్రకు వస్తున్న వరదలను దృష్టి లో ఉంచుకుని 2019-20 ఏడాదిలో తుంగభద్రకు 163 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేసినట్లు కా ర్యదర్శి పేర్కొన్నారు.

వరద అంచనాలను బట్టి కర్ణాటకకు 106.865, ఏపీకి 51.130, తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్ 5.005 టీఎంసీలను వినియోగించుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. సినీ నటుడి మరణంతో కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఆ రాష్ర్టానికి చెందిన ఇరిగేషన్ అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల పురోగతిపై సమీక్ష జరుగలేదన్నారు. ఈ సమావేశంలో పీజేపీ ఎస్‌ఈ ర ఘునాథరావు, టీబీ బోర్డు ఎస్‌ఈ కేవీ రమణ, కర్నూ ల్, అనంతపురం ఎస్‌ఈలు, డ్యామ్ ఈఈ, డీఈఈ లు, ఏఈఈలు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...