హరితహారాన్ని సక్సెస్ చేయండి


Wed,June 12, 2019 02:49 AM

-సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారిణి ప్రియాంక వర్గీస్
-హరితహారంపై అధికారులతో సమీక్షా సమావేశం
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని అధికారులు ఒకరికొకరు సమన్వయంతో అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులతో హరితహారం కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం ఐదో విడత హరితహారంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రతి ఒక్కరూ హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. కొత్త ప్రదేశాలలో మొక్కలను నాటాలని సూచించారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీలకు గాను 432 గ్రామ పంచాయతీలలో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

హరితహారం కార్యక్రమానికి నిర్దేశించిన మేరకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమ పరిధిలోని అనువైన ప్రాంతాలలో మొ క్కలు నాటించాలన్నారు. పాఠశాలలో, విశ్వవిద్యాలయాలలో, కళాశాలలో, ప్రార్థన స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని, కార్యాలయ ఆవరణలో అందుబాటులో ఉన్న ఏ ప్రదేశాన్ని వదలకుండా మొక్కలు నాటడమే ప్రత్యామ్నాయమని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటే మొక్కలు 2మీటర్ల కంటే ఎత్తుగా పెరిగిన మొక్కలే నాటాలని, గుట్టలపై నాటే మొక్కల విషయంలో ప్రత్యేక పద్ధతులు అనుసరించాలని తెలియజేశారు. మున్సిపల్ ప్రాంతాలలో నాటే మొక్కలను జిల్లాలోని పారిశ్రామి వేత్తలు దత్తత తీసుకోవాలని తెలిపారు. నర్సరీలలో జీవామృ తం తయారుచేసి మొక్కలకు అందించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. అంతకుముందు ప్రియాంక వర్గీస్, కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌లకు డీఎఫ్‌వో గంగారెడ్డి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...