ప్రతిభ ఉంటే ఆరుదైన గౌరవం


Wed,June 12, 2019 02:49 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : విద్యార్థులకు ప్రతిభ ఉంటే ఎక్కడైన ఆరుదైన గౌరవ మర్యాదాలతోపాటు పేరుప్రతిష్ఠలు వస్తాయని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. ఢిల్లీలో జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిర్వహించిన స్విక్‌మెక్ ఇంటర్‌నేషనల్ కన్వెషన్స్‌లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల కేజీబీవీ నుంచి పాల్గొన్న 21 మంది విద్యార్థినులను ప్రత్యేకంగా మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అభినందించారు. ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిర్వహించిన స్విక్‌మెక్ ఇంటర్‌నేషనల్ కన్వెషన్‌లో 21 మంది విద్యార్థినులు నేర్చుకున్న వాటిపై వారి అనుభవాల గురించి కలెక్టర్‌కు ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల సంప్రాదాయాల గురించి తెలుసుకున్నామని, మన తెలంగాణ సంప్రదాయాలను అక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ పర్యటన తమకు ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం కల్పించిందని మాకు ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి వారంతా ధన్యవాదములు తెలిపారు. పట్టుదల స్వయం కృషితో ఉన్నత అడుగులు వేయాలని పట్టుదల ఉంటే ఏదైన తమ సొంతం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉన్నత లక్ష్యాలను అధిరోహించి మీ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని కలెక్టర్ సూచించారు. డీఈవో రాజేష్, అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...