పాఠశాలాల ఆరంభం ఉత్సహాంగా చేయండి


Wed,June 12, 2019 02:49 AM

-lవీసీలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పాఠశాలల ఆరంభంను ఉత్సాహంగా చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైద్రాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు సైతం ఐ లవ్ మై జాబ్ అనే అంశాలపై వ్యాసం రాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పుస్తకాల పంపిణీ పక్కాగా చేయాలన్నారు. విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్నం అందజేయనున్న భోజన సౌకర్యాలను ప్రారంభం రోజు నుంచి విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాసంవత్సర క్యాలెండర్‌ను పక్కాగా పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని సూచించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండ పక్కాగా ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థులకు బోధించేలా ఉపాధ్యాయులు ఉండాలనే సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. బడిబాట కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ప్రత్యేకమైన రిజిస్టార్‌లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. డీఈవో నాంపల్లి రాజేష్, సెక్టోరల్ అధికారి అస్రాఖాద్రి, ఎంఈవోలు తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...