తగ్గిన ధాన్యం ధరలు


Wed,June 12, 2019 02:49 AM

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ధాన్యం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సోమవారం వరకు ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యంకు 18వందలకు పైగా ధరలు పలుకగా మంగళవారం వందరూపాయలు తగ్గింది. అదేవిధంగా హంసరకం ధాన్యం క్వింటాకు 16వందలకు పైగా ధరలు ఉండగా ఒక్కసారిగా 1,251పడిపోయింది. అంటే దాదాపు రూ.300 ధర తగ్గింది. మంగళవారం వ్యవసాయ మార్కెట్ 20క్వింటాళ్ల ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా రూ.1,732ధర రాగా కనిష్ఠంగా రూ.1,732, మధ్యస్తంగా రూ.1,732ధరలు వచ్చాయి. 9 క్వింటాళ్ల హంసరకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా రూ.1,351ధర రాగా కనిష్ఠంగా రూ.1,351, మధ్యస్తంగా రూ.1,351ధరలు వచ్చాయి. అదేవిధంగా 31క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా రూ.5,821ధర రాగా కనిష్ఠంగా రూ.5,821, మధ్యస్తంగా రూ.5,821ధరలు వచ్చాయి.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...