రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు


Wed,June 12, 2019 02:48 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: ఖమ్మం జిల్లాలో ఈనెల 8,9న జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. 100 మీ. పరుగు పందెంలో జనూన్ బంగారు, 400 మీ. పరుగు పందెంలో చందు కాంస్య పథకం సాధించారు. మంగళవారం స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పథకాలు సాధించడం అభినందనీయమన్నారు. బంగారు పతకం విజేతకు రూ.1000, వెండి పతకం విజేతకు రూ.500అందజేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్ కోచ్ ఆనంద్, సునిల్, సాఫ్ట్‌బాల్‌కోచ్ సాధిక్ అలీ, పీఈటీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...