ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలి


Wed,June 12, 2019 02:48 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన ఆర్.కె.బుడోకాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ విద్యార్థులకు సోమవారం ఎల్‌బీ స్టేడియంలో ఆయన బ్లాక్‌బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలతోపాటు కరాటే నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మాస్టర్ రవికుమార్, ఆర్‌కె బుడోకాన్ క్లబ్ ఫౌండర్ రవికుమార్, విద్యార్థులు సాయిచరణ్‌రెడ్డి, శ్రీమాన్, సాకేత్, స్నేహిత్, సృజయ్, సుప్రీత్, సహస్ర, శాలిని, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...