ముగిసిన బొడ్రాయి ఉత్సవాలు


Wed,June 12, 2019 02:48 AM

= హాజరైన ఎంపీ రాములు
ఉప్పునుంతల : మండల పరిధిలోని మామిళ్లపల్లిలో గత నాలుగు రోజుల నుంచి బొడ్రాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చివరి రోజు మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పోచమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. బొడ్రాయి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, బంధువులతో మామిళ్లపల్లి కిటకిటలాడింది. నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎంపీపీ అరుణా నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, పదర జెట్పీటీసీ రాంబాబు నాయక్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రవిందర్ రావు, తిరుపతి రెడ్డి, పర్వత్‌రెడ్డి, సత్యం, మల్లేష్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్ కల్పన పరమేశ్, ఎంపీటీసీ రామలక్ష్మమ్మ, దామోదర్ పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...