ఆటో బోల్తాపడి ఆరుగురికి గాయాలు


Wed,June 12, 2019 02:47 AM

మానవపాడు : దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వస్తూ ఆటో బోల్తాపడిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాల మండలం ఆర్ గార్లపాడుకు చెందిన కొందరు ఆటోలో ఉరుకుందు ఈరన్న దేవస్తానం వెళ్లి తిరిగి ఇంటి బాటపట్టారు. మంగళవారం మూడు గంటల సమయంలో మండల కేంద్రమైన మానవపాడు మీదుగా తమ సొంత గ్రామానికి బయలు దేరారు. రైల్వేగేటు సమీపంలోకి రాగానే ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలంలోకి వెళ్లి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రాజు, బాలకృష్ణ, రాధ, సుజాత, కృష్ణవేణి, బీచుపల్లిలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు 108 సిబ్బంది ఆనంద్, శ్రీశైలం తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...