గడ్డి వాములు దగ్ధం : 30 వేలు నష్టం


Sat,May 25, 2019 02:03 AM

మల్దకల్ : మండలంలోని ఉల్గెపల్లి గ్రామంలో విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో 4 గడ్డి వాములు దగ్ధం అయిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు తాయన్న పశువుల మేత కోసం గ్రామ సమీపంలో దొడ్డిలో 4 గడ్డి వాములను పెట్టుకున్నాడు. మేత దొడ్డిపై విద్యుత్ వైర్లు లైన్ ఉంది. అయితే అవి ఒకటికొకటి రాసుకోవడం వల్ల నిప్పులు రాలి గడ్డి వాములపై పడ్డాయి. దీంతో వెంటనే నాలుగు గడ్డి వాములు దగ్ధం అయ్యాయి. గ్రామస్తులు నీటితో అర్పేందుకు ప్రయ త్నించారు. దీంతో మొత్తం 30వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతును ఆదుకోవాలని కోరారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలివనపర్తి క్రీడలు: చదువుతోపాటు క్రీడా రంగంలో ఉన్నతంగా రాణించాలని అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు బోలమోని లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం స్థానిక బాలకిష్టయ్య క్రీడామైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాలోని క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండాఊపి ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో చదువుతోపాటు క్రీడారంగంలో ఉన్నత శిఖిరాలను అధిరోహించాలన్నారు. పరిస్థితులను బట్టి రోజు రోజుకు పెరుగుతున్న పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా వినియోగించుకోవాలని క్రీడాకారులకు సూచించాలన్నారు. అథ్లెటిక్స్ రాష్టస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముందుండాలని క్రీడాకారులను కోరారు. ఈ నెల 30, 31 తేదీలలో ఖమ్మం జిల్లాలో జరుగబోయే రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు వనపర్తి జిల్లా జట్టు ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికలను అండర్ 16, 18, 20 బాలబాలికలకు 100, 400 మీటర్ల విభాగంలో నిర్వహించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 10 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధానకార్యదర్శి నరసింహ, ఉపాధ్యక్షుడు శంశీర్ అలీ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నందిమళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...