గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


Sat,May 25, 2019 02:02 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా: గురుకుల కళాశాలలు ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్టీ గురుకులాల కోఆర్డినేటర్ పీఎస్ కళ్యాణి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆమె మాట్లాడారు. గురుకులాల్లో విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కల్పించనున్నారని, విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిగ్రీ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు సైతం పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి కమ్యూనికేషన్ స్కిల్స్‌కు వెలికితీసి జాతీయస్థాయి స్పోర్ట్స్‌లలో ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి గురుకులాల్లో ప్రవేశాలు ఇప్పించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి గురుకులాలకు పంపించాలని కోరారు. ఇప్పటికే ఇంటర్ కళాశాలలో ఐఐటీ, నీట్ కోచింగ్‌లతో విద్యార్థులను ఉన్నత విద్యకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ అకాడమిక్ సంవత్సరం నుంచి ఇంటర్ కళాశాలలో ఎంఎల్‌టీ కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై విద్యను అందించడానికి గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆలోచన విధానంతో గురుకులాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసన్న, విద్యాదరి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...