కౌంటింగ్ ప్రక్రియను పక్కాగా గమనించండి


Thu,May 23, 2019 01:15 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం జరుగుతున్న మైక్రోఅబ్జర్వర్ల కౌంటింగ్ ప్రక్రియను మైక్రోఅబ్జర్వర్లు ప్రశాంతంగా పక్కాగా గమనించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మైక్రోఅబ్జర్వర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కౌంటింగ్‌లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యతలో ప్రముఖ పాత్ర మైక్రోఅబ్జర్వర్లు ఉండాలని సూచించారు. మైక్రోఅబ్జర్వర్లు మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎక్కడ సమస్య వచ్చినా తక్షణమే ఆ సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా మైక్రోఅబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రత్యేకంగా నోట్స్ రూపొందించి కౌంటింగ్ తర్వాత తమకు నివేధికలను అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణపేట కలెక్టర్ ఎస్. వెంకట్‌రావు, డీఆర్‌వో స్వర్ణలత తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...