బస్టాండ్‌లో బంగారు నగల చోరీ


Thu,May 23, 2019 01:14 AM

జడ్చర్ల రూరల్ : జడ్చర్ల కొత్తబస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల బ్యాగులోనుంచి 10.5 తులాల బంగారు నగలు చోరీకి గురైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.నల్గొండ జిల్లా దేవరకొండ తాలుకా చందంపేట గ్రామానికి చెందిన కృష్ణ, చందన దంపతులు కుటుంబ సమేతంగా జడ్చర్ల పట్టణంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు ఫంక్షన్‌లో ఉన్న వారు తిరిగి దేవరకొండ వెళ్లేందుకు కల్వకుర్తి బస్సు ఎక్కేందుకు కొత్తబస్టాండ్ చేరుకున్నారు. అక్కడ కల్వకుర్తి డిపోకు చెందిన బస్సు ఏపీ 28, జడ్ 2819 బస్సును ఎక్కారు. కాగా బస్సులో ఎక్కే సమయం లో చందనతో పాటు ఆడపిల్లలు అందరూ ముందు భాగం నుంచి బస్సులో ఎక్కే సమయంలో బ్యాగ్‌లోని పర్సులో ఉన్న లాంగ్‌చైన్ 8 తులాలు, నెక్లెస్ 2.5తులాలు ఉన్న పర్సును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కాగా బస్సులో ఎక్కిన రెండు నిమిషాలకే పర్సు పొవడాన్ని గుర్తించి బస్సును ఆపేందుకు ప్రయత్నించగా బస్సు ఆపకుండా కొంతదూరం ముందుకెళ్లి ఆపడంతో తిరిగి బస్టాండ్‌లోకి వెళ్లి పరుగెత్తిచూడగా ఎవరూ కనిపించక పోవడంతో బోరున విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా జడ్చర్ల కొత్తబస్టాండ్‌లో ఇప్పటికే పలుమార్లు చోరీలు జరిగాయి. విలువైన ల్యాప్‌ట్యాప్‌లు, బంగారు వస్తువులు, బ్యాగులు ఎత్తుకెళ్లే దొంగలు ఉన్నా పోలీసులు కాని, ఆర్టీసీ అధికారులు కాని తగిన చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఉన్నా అవి కేవలం కర్నూల్ బస్టాప్‌ల వైపు ఉండడం కూడా దొంగలకు అనూకూలిస్తుందని ప్రజలు బాధితులు విమర్శిస్తున్నారు. పి

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...